'సైరా' లో తమన్నా.!

     Written by : smtv Desk | Sat, Apr 14, 2018, 07:16 PM

'సైరా' లో తమన్నా.!

హైదరాబాద్, ఏప్రిల్ 14 : స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటిస్తు౦డగా.. నయనతార కథానాయికగా నటిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రకు మిల్కీ బ్యూటీ తమన్నా ను తీసుకున్నట్లు సమాచారం. విజయ్‌ సేతుపతికి జోడీగా తమన్నా కనిపించనున్నారట. ఇందుకోసం తమన్నాను సంప్రదించగా.. ఆమె పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది "సైరా" ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Untitled Document
Advertisements