"మహానటి" టీజర్ వచ్చేసింది..

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 10:37 AM


హైదరాబాద్, ఏప్రిల్ 15 : అలనాటి మేటి నటి సావిత్రి.. జీవిత కథ ఆధారంగా మహానటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ ఆంటోని, శాలినీ పా౦డే లు ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ను విడుదల చేశారు.

ఈ టీజర్ లో ఎక్కువగా కీర్తి సురేష్ ను చూపించడంపైనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్ చేసినట్లు ఉంది. "అనగనగ ఒక మహానటి" అంటూ వచ్చే వాయిస్ ఓవర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీనికి మిక్కి జే మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌.., స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని మే 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Untitled Document
Advertisements