అంబేడ్కర్‌ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాత: కేసీఆర్‌

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 10:50 AM

అంబేడ్కర్‌ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాత: కేసీఆర్‌

హైదరాబాద్,ఏప్రిల్ 15: భారతీయ సమాజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని, భవిష్యత్‌ మార్గనిర్దేశనం చేసిన రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాతగానే నిలుస్తారని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు‌. శనివారం అంబేడ్కర్‌ జయంతి పురస్కరించుకుని అంబేడ్కర్‌ సేవలను ఆయన స్మరించుకున్నారు.

అంబేడ్కర్‌ దూరదృష్టి, దార్శనికత వల్లే ఇవాళ దేశం సామాజిక న్యాయం దిశగా ముందడుగు వేస్తు౦దని సీఎం అన్నారు. ప్రపంచ దేశాలకు, భారత్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి, భారత సమాజ పురోగతికి అవసరమైన ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు.

Untitled Document
Advertisements