'ఎన్టీఆర్' లో చేస్తా.. కాని షరతులు వర్తిస్తాయి...

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 11:02 AM

'ఎన్టీఆర్' లో చేస్తా.. కాని షరతులు వర్తిస్తాయి...

హైదరాబాద్, ఏప్రిల్ 15 : 'నందమూరి తారక రామారావు' జీవిత చరిత్ర ఆధారంగా "ఎన్టీఆర్" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రం కోసం విద్యాబాలన్ ను నటించమని చిత్రబృందం విద్యా ను సంప్రదంచిందట. కాని తన పాత్రకు అంత డిమాండ్ ఉండకపోవచ్చు అనే తన మేనేజర్ సలహాతో విద్యా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

విద్యాబాలన్ ఇంతవరకు అగ్రిమెంట్‌పై సంతకం కాని, అడ్వాన్స్‌ కాని తీసుకోలేదట. ఈ పాత్ర తాను చేయాలంటే కొన్ని కండిషన్లు వున్నాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తన పాత్ర నిడివి ఎంత,? ఎన్ని సన్నివేశాలుంటాయి.? లాంటి ప్రశ్నలు అడుగుతోందట. తనపై తీసిన సన్నివేశాలు ఫైనల్‌ కట్‌లో వుండాలని, అన్నింటిని ఎడిట్‌ చేసి కేవలం అతిథి పాత్ర మాదిరిగా చేయరాదని కండిషన్‌ పెడుతోందట. దీంతో దర్శకనిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ఇంతకి విద్యా కండిషన్‌లకు చిత్రయూనిట్ ఒప్పుకుంటుందో.? లేదో.? చూడాలి మరి.

Untitled Document
Advertisements