అలా పిలవొద్దని చాలా గొడవ చేశా : అనసూయ

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 12:56 PM

అలా పిలవొద్దని చాలా గొడవ చేశా : అనసూయ

హైదరాబాద్, ఏప్రిల్ 15 : "రంగస్థలం" లో రంగమ్మత్తగా తన నటనతో విమర్శకులను సైతం మెప్పించింది యాంకర్ అనసూయ. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనలను వెల్లడించింది. రంగస్థలంలో నటించమని సుకుమార్ అడిగినప్పుడు రామ్ చరణ్, సమంత, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ వంటి పెద్ద స్టార్స్ తో నటించాలంటే కాస్త భయపడ్డానని తెలిపింది. అయితే షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు అందరితో పాటు కాకుండా షూటింగ్ ప్రారంభమైన వారం రోజుల తర్వాత వెళ్లిందట.

అప్పటికి రామ్ చరణ్, సమ౦త నల్లగా మారిపోయారని.. తను రంగమ్మత్తగా రెడీ అయి వెళ్లేసరికి చరణ్ నన్ను చూసి నువ్వెందుకు ఇంత తెల్లగా ఉన్నావ్.. ఇలా ఉంటే మాలో కలిసిపోలేవు అంటూ చేతులకు మట్టి పూశారట. ఇలా చిత్ర బృందమంతా షూటింగ్ లో ఫ్రెండ్లీగా ఉండటంతో తనకు టెన్షన్ తగ్గిపోయింద౦టూ చెప్పుకొచ్చింది అనసూయ. తనను అత్త అని పిలవొద్దని చాలా గొడవ చేశానని.. కానీ ఇప్పుడు ఆ పిలుపే నచ్చుతోందని తెలిపింది.

Untitled Document
Advertisements