రెండు సినిమాల్లో.. ఒకే పాత్ర..

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 01:56 PM

రెండు సినిమాల్లో.. ఒకే పాత్ర..

హైదరాబాద్, ఏప్రిల్ 15 : "రంగస్థలం" చిత్రంలో రామలక్ష్మి గా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన సమ౦త అక్కినేని.. చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. 'రంగస్థలం' తర్వాత సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న "మహానటి" చిత్రంలో సమంత ఒక జర్నలిస్టుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల సమంత ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఇదిలా ఉండగా.. ఓ కన్నడ రీమేక్ "యూ టర్న్" లో సైతం సమ౦త జర్నలిస్టుగా నటిస్తోంది. లేడి ఓరియె౦టెడ్ హార్రర్ థ్రిల్లర్ గా 'యూ టర్న్' చిత్రం తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాల్లోనూ సమంత జర్నలిస్టుగానే నటిస్తోంది. కాని 'మహానటి', 'యూ టర్న్' చిత్రాలు రెండు వేర్వేరు కాలాల్లో కొనసాగుతాయి. ఆనాటి కాల౦లో ఉన్న జర్నలిస్టులకు.. ఈనాటి కాలంలో జర్నలిస్టులకు చాలా తేడా ఉంటుంది. ఒకే పాత్రకు రెండు కాలాల్లో సమంత తన నటనతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దంగా ఉంది.

Untitled Document
Advertisements