'సైరా' లో అనసూయ..?

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 02:43 PM

'సైరా' లో అనసూయ..?

హైదరాబాద్, ఏప్రిల్ 15 : యాంకర్ అనసూయ.. "రంగస్థలం" లో రంగమ్మత్తగా ప్రేక్షకులను అలరించి.. నటనలో అందరి చేత భేష్ అనిపించుకుంది. సినీ ప్రముఖులందరి చేత ప్రశంసలు పొందింది. అయితే తాజాగా అనసూయ.. మెగాస్టార్ "సైరా నరసింహారెడ్డి" చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనసూయ ఈ వార్త పట్ల స్పందించింది.

“అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న "సైరా" లో నా పాత్ర ఉందని నాక్కూడా తెలియదు. ఒకవేళ అదే నిజమైతే అంతకన్నా అదృష్టం ఇంకే౦ లేదు. సైరాలో అవకాశం వస్తే మాత్రం వదులుకోను ఖచ్చితంగా చేస్తా” అంటూ వెల్లడించింది. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Untitled Document
Advertisements