"మనం సైతం" సంస్థకు మెగాస్టార్ విరాళం..

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 03:07 PM


హైదరాబాద్, ఏప్రిల్ 15 : మెగాస్టార్ చిరంజీవి "మనం సైతం" సంస్థకు రూ.2 లక్షల విరాళం అందించారు. మనం సైతం సంస్థ సేవా కార్యక్రమాలు తెలుసుకున్న చిరు.. ఆ నిర్వాహకుడు కాదంబరి కిరణ్‌ను ఇంటికి ఆహ్వానించారు. ఈ మేరకు విరాళాన్ని అందించి.. స్వయంగా తను రాసిన ప్రశంసా పత్రాన్ని అందించారు.

అంతేకాకుండా సంస్థకు సంబంధించి ఎప్పుడు, ఎలాంటి సహాయమైనా చేశానని మాటిచ్చారు. ఈ నేపథ్యంలో కాదంబరి కిరణ్‌ మాట్లాడుతూ.. ఇంత గొప్ప వ్యక్తి అండ దొరకడం నిజంగా మా అదృష్టం అన్నారు. ఆయన మాటలెంతో స్ఫూర్తి కలిగించాయని, ఈ స్పూర్తితోనే మరింత కృషి చేసి పేదల కోసం సహాయం చేస్తామని వెల్లడించారు.

Untitled Document
Advertisements