కాంగ్రెస్‌ నేతలకు అభివృద్ధి కనిపించదు: కడియం

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 03:44 PM

కాంగ్రెస్‌ నేతలకు అభివృద్ధి కనిపించదు: కడియం

వరంగల్, ఏప్రిల్ 15‌: కాంగ్రెస్‌ నేతలకు సీఎం కుర్చీ తప్ప.. అభివృద్ధి కనిపించదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. అధికారం కోసమే కాంగ్రెస్‌ నేతలు బస్సుయాత్రలు చేస్తున్నారని కడియం ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి.. కాంగ్రెస్‌ నేతలకు పలు ప్రశ్నలు సంధించారు. ఎప్పుడైనా 6 గంటల కరెంట్‌ ఇచ్చారా? అని నిలదీశారు. అలాగే ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనైనా పంట పెట్టుబడి పథకం గురించి ఆలోచన చేశారా? అని ఆయన ఎద్దేవా చేశారు.

Untitled Document
Advertisements