కరీనా.. ఓ ముస్లిం ను చేసుకుందని...

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 04:44 PM

కరీనా.. ఓ ముస్లిం ను చేసుకుందని...

ముంబై, ఏప్రిల్ 15 : జమ్మూ కశ్మీర్ లోని కథువా జిల్లాలో అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. మతకలహాల వల్ల ముస్లిం అయిన ఎనిమిదేళ్ల ఆసిఫాపై కొందరు వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

తానూ ఒక హిందూ అయ్యుండి ఒక ముస్లింను పెళ్లి చేసుకుంది. ఇలా చేసినందుకు తను సిగ్గుపడాలి. వీరి ప్రేమకు గుర్తుగా ఒక బాబు కుడా ఉన్నాడు. తనకు తైమూర్ అని రాక్షసుడి పేరు పెట్టారని ట్వీట్ చేశాడు. దీనికి ధీటుగా బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌ సమాధానమిచ్చారు.

"దేవుడు నీకు బుర్ర ఇస్తే అందులో పూర్తిగా ద్వేశాన్నే నింపుకున్నావు. అసలు నీలాంటి వాడు దేశానికే సిగ్గుచేటు. అసలు నీలాంటి వాడు భూమ్మీద ఉన్నందుకే సిగ్గుగా ఉంది" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఆసిఫాకు న్యాయం చేయాలంటూ కరీనా, స్వరా ప్లకార్డులు పట్టుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

Untitled Document
Advertisements