విదేశీ యువతి ఆత్మహత్య

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 05:55 PM

విదేశీ యువతి ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్ 15 : మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ విదేశీ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే గత కొన్ని నెలల క్రితం ఉబ్జెకిస్తాన్‌కు చెందిన వర్ఫాలియా జుళ్ఫియాస్‌ అనే యువతిని పోలీసులు వ్యభిచారం కేసులో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. సదరు యువతికి కౌన్సిలింగ్‌ నిర్వహించిన కోర్టు పునరావాస కేంద్రంలో ఆశ్రయం కల్పించాలంటూ ఆదేశించింది.

దీంతో వర్ఫలియాను ఆమనగల్లుకు సమీపంలోని ప్రజ్వల మహిళా పునరావాస కేంద్రంలో ఉంచారు. అయితే శనివారం ఆకస్మికంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు కారణం తెలియరాలేదు. ఈ ఘటనపై పునరావాస నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.

Untitled Document
Advertisements