శ్రీరెడ్డి కాదు శ్రీ 'శక్తి'...

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 06:23 PM

శ్రీరెడ్డి కాదు శ్రీ 'శక్తి'...

హైదరాబాద్, ఏప్రిల్ 15 : నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై ఇంకా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది. తమకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్ట౦ చేసింది. తాజాగా శ్రీరెడ్డి తన పేరును మార్చుకున్నట్లు తెలిపింది. శ్రీరెడ్డి పేరును శ్రీ శక్తి గా మార్చుకున్నట్లు ప్రకటించింది. ఇంతకి పేరు మార్చుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఈ పోరాటంలోకి వచ్చాక అన్నలంతా పిలిచేటప్పుడు శ్రీరెడ్డి అని పిలిచేవారు. ఎవరికీ ఎలాంటి సమస్య లేకున్నా.. ఎవరికీ కులపరమైన భావనను దగ్గరకు రానివ్వకుండా కలుపుకుపోతున్నట్లు చెప్పారు. అయినా.. ఎవరైనా నీ పేరేంటి? అని అడిగినప్పుడు శ్రీరెడ్డి అని చెప్పటానికి కాస్త ఇబ్బందిగా ఉందన్నారు. ఆ ఒక్క తోక వల్ల ఎదుటివారికి కొంచెం ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతోనే తాను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

దర్శకుడు దిల్ దాజును ప్రస్తావిస్తూ.. "రెడ్డి అయి ఉండి దిల్ రాజు అన్ని థియేటర్స్ ను ఆయన చేతిలో పెట్టుకొని ఎంతో మంది ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న వేళ నేను వాళ్లకు వత్తాసు పలకాలి అనుకోవట్లేదు. వాళ్ల మీద కూడా నా యుద్ధం ఉంది. అలాంటి రెడ్లలో కూడా చాలా గొప్పవాళ్లున్నారు. నాకెందుకో అలా పిలిస్తే ఇబ్బందిగా అనిపిస్తోంది. అందుకే నా పేరును శ్రీ శక్తిగా పేరు మార్చుకున్నా" అంటూ తెలిపింది.

Untitled Document
Advertisements