ప్రియా వారియర్ యాటిట్యూడ్ చూడండి..!

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 06:38 PM

ప్రియా వారియర్ యాటిట్యూడ్ చూడండి..!

ముంబై, ఏప్రిల్ 15 : కన్నుగీటి రాత్రికి రాత్రే స్టార్ డమ్ తెచ్చుకున్న కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్. "ఒరు ఆదర్ లవ్" చిత్రంలోని ఓ పాటకు తన హావభావాలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఆ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ప్రియా ఫోటోలు, వీడియోలే కనపడేవి. అంతలా కుర్రకారును గిలిగింతలు పెట్టింది. తాజాగా ప్రియా తనకున్న క్రేజ్ ను ప్రకటనలకు ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇటీవల తాను నటించిన తొలి యాడ్ బయటికి వచ్చేసింది. నేస్ట్లే మంచ్ చాక్లెట్ యాడ్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందు వచ్చింది.

ప్రస్తుతం ఐపీఎల్ ఊపేస్తున్న నేపథ్యంలో ఆ బ్యాక్ డ్రాప్ లోనే ఈ యాడ్ రూపొందించారు. మైదానంలో క్రికెట్ ఆడుతు౦డగా.. ఓ బంతి ప్రియా దగ్గరికి వెళ్తుంది. ఆ బంతి ఇవ్వమని ఓ కుర్రాడు అడగ్గా ఆమె నో అంటుంది. ఇంత యాటిట్యూడా అంటాడా కుర్రాడు. అప్పుడామె మంచ్ తింటూ ఉంటుంది. దాంతో పాటుగా ఫ్రీగా వచ్చే యాటిట్యూడ్ హ్యాండ్ బ్యాండ్ వేసుకోవడం వల్ల ఆమె ఆ యాటిట్యూడ్ చూపిస్తుందన్నమాట. మరోసారి తనదైన శైలిలో నటించి కన్నుగీటి అభిమానులను అలరిస్తోంది.

Untitled Document
Advertisements