అది అబద్దం.. నేను నటించట్లేదు.. : రకుల్

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 06:56 PM

అది అబద్దం.. నేను నటించట్లేదు.. : రకుల్

హైదరాబాద్, ఏప్రిల్ 15 : నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న "సవ్యసాచి" చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక ప్రత్యేక గీతంలో నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రకుల్ స్పందించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ సినిమా.. తమిళంలో మరో సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు.

అయితే నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో "సవ్యసాచి"లో నాగార్జున సూపర్ హిట్ సాంగ్ అయిన 'నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయత్తు' పాటను రిమిక్స్ చేస్తున్నారు. ఈ పాటలో నటించట్లేదని, ఆ ప్రచారంలో నిజంలేదని రకుల్ స్పష్టం చేశారు. అయితే ఇంతకు ముందు చైతన్యతో కలిసి రకుల్ "రారండోయ్ వేడుక చూద్దాం" సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూల్లనే రాబట్టింది.

Untitled Document
Advertisements