ఏపీ బంద్ కు వైకాపా మద్దతు

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 07:00 PM

ఏపీ బంద్ కు వైకాపా మద్దతు

విజయవాడ, ఏప్రిల్ 15: ప్రత్యేక హోదా సాధన సమితి రేపు తలపెట్టిన బంద్‌కు వైకాపా మద్దతు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే పోరాటంలో సోమవారం తలపెట్టిన బంద్‌ పిలుపుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన పాదయాత్రకు విరామం ప్రకటించారు.

వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, నాయకులు బంద్‌లో పాల్గొనేందుకు వీలుగా రేపు పాదయాత్రకు వైఎస్‌ జగన్‌ విరామం ప్రకటించారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ముత్యాలంపాడు పాదయాత్ర శిబిరం వద్దే వైఎస్‌ జగన్‌ బసచేస్తారు. ఏప్రిల్‌ 17న ఉదయం యథాప్రకారం ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమవుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Untitled Document
Advertisements