సీపీఎం మహాసభల ప్రచార బెలూన్‌ ఆవిష్కరణ

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 07:32 PM

సీపీఎం మహాసభల ప్రచార బెలూన్‌ ఆవిష్కరణ

హైదరాబాద్, ఏప్రిల్ 15 ‌: ఈ నెల 18 నుంచి 22 వరకు నగరంలో సీపీఎం జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు తెలిపారు. శనివారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జాతీయ మహాసభల ప్రచార బెలూన్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 4 రోజులపాటు జరిగే అఖిల భారత మహాసభలకు సీపీఎం జాతీయ నాయకులు సీతారాం ఏచూరి, బృందాకారత్, కేరళ సీఎం పినరై విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్, ఇతర వామపక్షాల నేతలు హాజరవుతారని పేర్కొన్నారు.

ప్రజల సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. పార్టీ నూతన కమిటీలో మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. మహాసభ సందర్భంగా నగరాన్ని ఎరుపురంగు తోరణాలతో అలంకరిస్తున్నట్లు వివరించారు.

Untitled Document
Advertisements