అనిల్ కపూర్ ఇంట్లో పెళ్లి సందడి..

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 11:53 AM

అనిల్ కపూర్ ఇంట్లో పెళ్లి సందడి..

ముంబై, ఏప్రిల్ 16 : ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇంట పెళ్లిసందడి నెలకొంది. అనిల్ కూతురు సోనమ్ కపూర్.. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ అహూజా ను త్వరలోనే వివాహమాడబోతోంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహబంధ౦తో ఒక్కటి కానున్నారు. తొలుత స్విట్జర్లాండ్‌లో వీరి వివాహం జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. కాని వీరి కుటుంబం అంతా ముంబైలో ఉండడంతో పెళ్లి ఇక్కడే జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా సోనమ్.. కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే పెళ్ళికి ముందు నిర్వహించే సంగీత్ వేడుకలో డాన్స్ లతో సందడి చేసేందుకు సోనమ్ కు ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ స్టెప్పులు కంపోజ్ చేస్తున్నారు. సోనమ్ ఇప్పటి వరకు నటించిన సినిమాలోని పాటలకు డాన్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన ప్రముఖులంతా హాజరుకానున్నారు. విందు వివాహానంతరం ఢిల్లీలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం సోనమ్.. "వీరే ది వెడ్డింగ్" చిత్రంలో నటిస్తున్నారు.

Untitled Document
Advertisements