అల్లు అర్జున్ సెట్లో అనుకోని అతిథి..

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 12:10 PM

అల్లు అర్జున్ సెట్లో అనుకోని అతిథి..

హైదరాబాద్, ఏప్రిల్ 16 : అల్లు అర్జున్.. వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య". ఈ చిత్రాన్ని రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌, శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. అయితే అనుకోని అతిథిలా 'నా పేరు సూర్య' సెట్ లో మెగాస్టార్ సందడి చేశారు. అక్కడి షూటింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిరుతో పాటు నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఉన్నారు.

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సెట్ లో అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ లపై "బ్యూటీ ఫుల్ లవ్" సాంగ్ ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. విశాల్ శేఖర్ బాణీలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 29 న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి.. మే 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Untitled Document
Advertisements