భావితరాల కోసమే ఈ పోరాట౦: చలసాని

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 12:19 PM

భావితరాల కోసమే ఈ పోరాట౦: చలసాని

విజయవాడ, ఏప్రిల్ 16 : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన రాష్ట్ర బంద్‌ కొనసాగుతోంది. భావితరాల కోసమే ఈ పోరాటమని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్ అన్నారు. బంద్‌లో పాల్గొనేందుకు ముందుకు వస్తున్న ప్రజలకు, అన్ని పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చిన్న చిన్న ఇబ్బందులున్నా సహకరించాలని కోరారు. ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని బంద్ పాటిస్తున్నామని చెప్పారు.

ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చలసాని తెలియజేశారు. హోదా సాధన సమితి ఇచ్చిన బంద్‌ లో టీడీపీ, బీజేపీ మినహా అన్ని పార్టీలు పాల్గొన్నాయి

Untitled Document
Advertisements