బ్యూటీషియన్‌ అనుమానాస్పద మృతి

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 01:11 PM

 బ్యూటీషియన్‌ అనుమానాస్పద మృతి

వికారాబారాద్, ఏప్రిల్ 16: హైదరాబాద్ శివార్లలోని లింగంపల్లిలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే, వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన జ్యోతి గ్రీన్ ట్రెండ్స్ లో బ్యూటీషియన్. నిన్న తాండూరులోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరింది.

ఈ ఉదయం ధారూర్‌ మండలం మైలారం రైల్వే స్టేషన్ సమీపంలో యువతి మృతదేహం పడివున్నట్టు గమనించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు ఆమెను జ్యోతిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని హత్యానా?... ఆత్మహత్యానా?.. రైలు నుంచి పడిపోయిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే జ్యోతి మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెపై అత్యాచారం జరిపి.. అనంతరం హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు.

Untitled Document
Advertisements