నెటిజన్ పై మండిపడ్డ మెహ‌రీన్..

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 01:24 PM

నెటిజన్ పై మండిపడ్డ మెహ‌రీన్..

హైదరాబాద్, ఏప్రిల్ 16 : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా ఘటన ప్రతి ఒక్కరిని కదలించింది. ఎనిమిదేళ్ల బాలికపై సాముహిక అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇంతటి దారుణానికి ఒడికట్టిన నేరస్తులను వదలకూడదు అంటూ ప్రతిఒక్కరు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ.. న్యాయం జరగాలంటూ పోస్టులు చేశారు. తాజాగా హీరోయిన్ మెహ‌రీన్ ఘాటుగా స్పందించింది.

"నేను హిందుస్తానీ.. సిగ్గుపడుతునా.. ఎనిమిదేళ్ల బాలికపై సాముహిక అత్యాచారం, హత్య.. అది కూడా ఒక ప్రవిత్రమైన ఆలయంలో.. న్యాయం జరగాలి".. అంటూ హ్యాష్‌ట్యాగ్‌ జత చేసి ఉన్న ఒక పోస్టర్ ను పోస్ట్ చేశారు. దీంతో ఓ నెటిజన్ చాలా విచిత్రమైన సమాధానం ఇచ్చాడు. "హిందుస్థానీగా ఉండటం మీకు అంత సిగ్గుగా అనిపిస్తే దేశాన్ని విడిచి వెళ్లిపో.. అంతేకాని హిందుస్థానీయులుగా ఉన్నందుకు మేం చాలా గర్విస్తున్నాం. పిల్లలపై ఇలాంటి దారుణాలు.. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ జరుగుతున్నాయి. మరీ ఇంతలా వారు ఓవర్‌ యాక్షన్‌ చేయలేదు" అంటూ ట్వీట్ చేశారు. దీనికి మెహ‌రీన్ ఘాటుగా "నీలాంటి వారి కోసమే ఈ పోస్ట్‌ చేశా" అంటూ సమాధానమిచ్చింది.

Untitled Document
Advertisements