అట్టహాసంగా ముగిసిన కామన్‌వెల్త్‌ గేమ్స్..

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 01:39 PM

అట్టహాసంగా ముగిసిన కామన్‌వెల్త్‌ గేమ్స్..

గోల్డ్‌కోస్ట్‌, ఏప్రిల్ 16 : ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరుగుతున్నా 21వ కామన్వెల్త్‌ గేమ్స్‌-2018 ఘనంగా ముగిశాయి. ఏప్రిల్ 4న మొదలైన ఈ క్రీడల ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ ముగింపు వేడుకల్లో భారత అథ్లెట్ల బృందానికి బాక్సింగ్‌ దిగ్గజం మేరికోమ్‌ నేతృత్వం వహించారు. త్రివర్ణపతకాన్ని చేతపట్టుకోని నడుస్తూ.. కామన్వెల్త్‌ గేమ్స్‌కు ముగింపు పలికారు.

26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యలను భారత అథ్లెట్లు సొంతం చేసుకున్నారు. మొత్తం 66 పతకాలతో భారత్‌ మూడోస్థానంలో నిలిచింది. 198 పతకాలతో(80 స్వర్ణాలు,59 రజతాలు, 59 కాంస్యాలు) ఆస్ట్రేలియా అగ్ర స్థానంలో ఉండగా 136 పతకాలతో(45 స్వర్ణాలు, 45 రజాతాలు, 46 కాంస్యలతో) ఇంగ్లండ్‌ ద్వితీయ స్థానంలో నిలిచింది.

Untitled Document
Advertisements