అమితాబ్ కు నచ్చిన పదం ఏంటో తెలుసా..?

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 02:16 PM

అమితాబ్ కు నచ్చిన పదం ఏంటో తెలుసా..?

ముంబై, ఏప్రిల్ 16 : బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తరచూ ఓ పదం వాడుతూ ఉంటారు. ఆ పదం అంటే బిగ్‌బి కి ఎంతో ఇష్టమట. ట్విట్టర్ లో ఏం ట్వీట్ చేసినా.. ఆ పదం మాత్రం ఖచ్చితంగా వాడుతు౦టారు. ఇంతకు అమితాబ్ కు ఇష్టమైన పదం ఏంటో తెలుసా.! "బడుంబా".. అవునండీ. తాజాగా ఆ పదానికి అర్థమేంటో అమితాబ్ వెల్లడించారు. బడుంబా అంటే 'జోష్‌' అట. ఆనందం కలిగించేది అని అర్థం వస్తు౦దట. అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న "102 నాటౌట్" చిత్రంలో 'జుంబా జుంబా బడుంబా' అనే పాటను అమితాబ్ పాడారు.

ఈ పాట వీడియోను ట్విటర్‌లో విడుదల చేశారు. అమితాబ్ సరదాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "బడుంబా అంటే.. జోష్‌ అని అర్థం. ఆనందం కలిగించేది అని అర్థం వస్తుంది. ఒక్కసారి ఈ పాట వింటే మీకు కూడా అంతే ఆనందం కలుగుతుంది" అంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ పాటకు అభిమానులు పేరడీ వెర్షన్లు తనకు పంపాల్సిందిగా అమితాబ్‌ కోరారు.

ఉమేశ్‌ శుక్లా దర్శకత్వం వహిస్తున్న "102 నాటౌట్" చిత్రంలో అమితాబ్ 102 ఏళ్లు బతికి ప్రపంచంలోనే కురువృద్ధుడు కావాలని కలలు కంటుంటారు. కాని తన కుమారుడు రిషి కపూర్‌ కు తన తండ్రి పనులు నచ్చవు.. ఇంతకు వీరిద్దరి మధ్య జరిగిందేమిటి..? అన్నదే సినిమా ప్రధాన కథ. మే 4 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.





Untitled Document
Advertisements