చెన్నైకు మరో షాక్ తగలనుందా..!

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 03:11 PM

చెన్నైకు మరో షాక్ తగలనుందా..!

మొహాలీ, ఏప్రిల్ 16 : 'మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు' ఉంది చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి. ఇప్పటికే గాయం కారణంగా కేదార్ జాదవ్ ఏకంగా టోర్నీకు దూరంకాగా, గాయం వలన సురేశ్‌ రైనా తదుపరి మ్యాచ్ నుండి వైదొలిగాడు. కావేరి నది జలవివాదాల సమస్యతో చెన్నై లో జరగాల్సిన మ్యాచ్ లు పూణేకు తరలిపోయాయి. ఒక వైపు స్టార్ బౌలర్ లుంగీ ఎంగిడి తండ్రి మరణించడంతో స్వదేశానికి వెళ్లాడు.

తాజాగా ఇప్పుడు జట్టు సారథి ‌మహేంద్ర సింగ్‌ ధోనీ టోర్నీలో భాగంగా చెన్నై ఆడే తదుపరి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆదివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ నడుం నొప్పితో తీవ్ర ఇబ్బందిపడ్డాడు. నొప్పిని భరించలేక మధ్యలో ఆ జట్టు ఫిజయోను పిలిపించుకుని ట్రీట్‌మెంట్‌ చేయించుకున్నాడు. దీంతో ఆ జట్టు తర్వాత ఆడే మ్యాచ్‌లో ధోనీ ఆడే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. ‘వెన్ను నొప్పి తీవ్రంగా బాధించింది. ఇప్పుడు కాస్త ఫర్వాలేదు. ఇలాంటి చిన్న చిన్న నొప్పులు భరిస్తూ ఆడే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు’ అని ధోనీ వ్యాఖ్యానించాడు.

టోర్నీలో భాగంగా చెన్నై తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్‌ 20న రాజస్థాన్‌ రాయల్స్‌తో ఆడనుంది. నాలుగు రోజుల సమయం ఉండటంతో ధోనీ పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. మరి ఎంజరుగుతుందో చూడాలి.





Untitled Document
Advertisements