దిశా పటాని దశ తిరిగినట్టే!!!

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 03:12 PM

దిశా పటాని దశ తిరిగినట్టే!!!

ముంబై, ఏప్రిల్ 16 : బాలీవుడ్ భామ దిశాపటాని లేటెస్ట్ ఫోటో చూస్తే మతి పోవాల్సిందే. ఇటీవల ఆమె నటించిన "బాఘీ-2" చిత్రంలో కథానాయకుడు టైగర్ ష్రాఫ్ ఫైట్లు ఎంతగా మెప్పించాయో.. దిశా అందాలు అంతగా అలరించాయి. ఇటీవల టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన "లోఫర్" సినిమాలో వరుణ్ తేజ్ పక్కన హీరోయిన్ గా చేసింది. కాని ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

అయినప్పటికీ ఈ అమ్మడుకి ప్రస్తుతం అవకాశాలు వరుస కట్టాయనే చెప్పాలి. ఎందుకంటే.. ఓ వైపు తన గ్లామర్ ను కాపాడుకుంటూనే.. మరోపక్క డాన్స్ లతో ఫిట్నెస్ ను మెయిన్ టెయిన్ చేస్తోంది. ఆమెకు సినిమా అవకాశాలే కాదు యాడ్ కంపెనీలు సైతం దిశా వెంటపడుతున్నాయి. తాజాగా ఓ స్పోర్ట్స్ వేర్ కంపెనీకి దిశా ఇచ్చిన స్టిల్స్ చూస్తే షాక్ తినాల్సిందే. అంతలా ఆకట్టుకుంది ఆ స్టిల్. స్కిన్ టైట్ డ్రస్ లో ఆమె ఇచ్చిన ఫోజులకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే.

Untitled Document
Advertisements