మహేష్ బాబు మేనల్లుడి సినీ రంగ ప్రవేశం ఖరారు!!!

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 03:43 PM

మహేష్ బాబు మేనల్లుడి సినీ రంగ ప్రవేశం ఖరారు!!!

హైదరాబాద్, ఏప్రిల్ 16 : ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ సినీ రంగ ప్రవేశం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు తన మేనల్లుడి బాధ్యతను పూర్తిగా మహేష్ బాబు తీసుకున్నారు. అశోక్ కి నటన అంటే ఎంతో ఇష్టమట. దీనికోసం అమెరికాలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నారట. స్వయంగా ప్రిన్స్ తన మేనల్లుడిని దిల్ రాజుకు అప్పగించినట్లు తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం.. వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు కృష్ణారెడ్డి గండదాసు తెరకెక్కించనున్న సినిమాలో అశోక్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మహేష్ బాబు బావ సుధీర్ బాబు నటించిన "ఆడు మగాడ్రా బుజ్జి" సినిమాకు కృష్ణారెడ్డి గండదాసు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే నెలలో సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఇంకా ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

Untitled Document
Advertisements