విజయనగరంలో గ్యాంగ్ రేప్

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 03:52 PM

విజయనగరంలో గ్యాంగ్ రేప్

విజయనగరం, ఏప్రిల్ 16 : కశ్మీర్ లోని కథువా కేసుపై దేశ వ్యాప్తంగా నిరసనలు ఉద్రిక్తమవుతుండగానే విజయనగరంలో మరో గ్యాంగ్ రేప్ జరిగింది. బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన యువతిని ఆటో డ్రైవర్ అతని స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి అరుపులు కేకలు విన్న స్థానికులు ఘటన స్థలికి చేరడంతో నిందితులు బాధితురాలిని వదిలి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆటో డ్రైవర్ సహా ముగ్గురిపై కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.

Untitled Document
Advertisements