ప్రియ.. మరోసారి ఫిదా..!

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 05:04 PM

ప్రియ.. మరోసారి ఫిదా..!

హైదరాబాద్, ఏప్రిల్ 16 : ప్రియ ప్రకాష్ వారియర్.. "ఒరు అదర్ లవ్" చిత్రంలోని పాటలో కన్నుగీటి కుర్రకారు గుండెల్లో పాగా వేసిన తార. తన హావాభావాలతో ప్రజలను ఉక్కిరిబిక్క్రిరి చేసి.. కొన్నిరోజులు ఫేస్ బుక్, వాట్సప్ లకు విరామం లేకుండా చేసింది. రాత్రికి రాత్రే స్టార్డం తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతోంది.

తాజాగా ప్రియ మరోసారి ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. మ‌ల‌యాళ నూత‌న సంవ‌త్స‌ర౦ "విఘా"ను పురస్కరించుకొని ప్రేక్ష‌కుల‌కు శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సంద‌ర్భంగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పూర్తి సంప్ర‌దాయ‌బ‌ద్దంగా ఎర్ర‌బొట్టు, క్రీమ్ క‌ల‌ర్ చీర క‌ట్టుకుని ఉన్న ప్రియ.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ప్రియ తొలి సినిమా "ఒరు ఆదార్ ల‌వ్‌" జూన్ 14వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇటీవల నేస్ట్లే మంచ్ యాడ్ లో ఎంతో యాటిట్యూడ్ ను చూపిస్తూ అలరించింది.

Untitled Document
Advertisements