సుందర్ '555' స్టొరీ అదంటా..

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 05:07 PM

సుందర్ '555' స్టొరీ అదంటా..

బెంగళూరు, ఏప్రిల్ 16 : ఐపీఎల్ -11 సీజన్ లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న వాషింగ్టన్ సుందర్ జెర్సీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అతని వేసుకున్న జెర్సీ నెంబర్ 555 కావడమే. సుందర్‌ తన జెర్సీపై 555ను ఎందుకు ఎంచుకున్నాడో తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు.

తాజాగా ఇదే విషయాన్ని సుందర్‌ని అడగ్గా అసలు విషయం బయటపెట్టాడు. "నేను 1999 అక్టోబరు 5న ఉదయం 5:05గంటలకు జన్మించాను. అందుకే నేను నా కిట్‌ నంబర్‌ను 555గా ఎంచుకున్నాను" అని చెప్పాడు.

గత ఏడాది రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐపీఎల్‌కు దూరం కావడంతో ఈ తమిళనాడు బౌలర్ అనుకోకుండా రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. అప్పుడు 11 మ్యాచ్‌లాడిన సుందర్‌ 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ తరుపున ఆడుతున్న ఈ యువతేజం మూడు మ్యాచ్‌లాడి 3 వికెట్లు తీశాడు.

Untitled Document
Advertisements