విరాట్ రైనాను దాటేస్తాడా..!

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 05:58 PM

విరాట్ రైనాను దాటేస్తాడా..!

బెంగళూరు, ఏప్రిల్ 16 : ఐపీఎల్‌ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సురేష్ రైనా మొదటి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌ ఆరంభ సీజన్ నుంచి ఇప్పటి వరకూ 163 మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు రైనా 4,558 పరుగులతో,అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా ఈ ఏడాది సీజన్‌ ముగిసే సరికి రైనాను విరాట్ కోహ్లీ దాటేసేలా ఉన్నాడు.

ఈ క్రమంలోనే అతడు 4,500 పరుగుల క్లబ్‌లో చేరాడు. ఇప్పటివరకూ 152 మ్యాచ్‌లాడిని కోహ్లీ 4,527 పరుగులు సాధించాడు. కోహ్లికి, రైనాకి మధ్య ఉన్న పరుగుల తేడా 31 మాత్రమే. మరో ఒకటి లేదా రెండు మ్యాచుల్లో కోహ్లీ.. రైనా స్కోరును దాటే అవకాశం ఉంది.

Untitled Document
Advertisements