"మెహబూబా" ఫస్ట్ సింగిల్‌..

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 06:25 PM


హైదరాబాద్, ఏప్రిల్ 16 : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి తనయుడు ఆకాష్ పూరి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం "మెహబూబా". శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌లో నిర్మించిన ఈ చిత్రాన్ని 1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో జరిగే యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు.

ఇటీవల రిలీజ్ అయిన చిత్ర టైలర్ కు ప్రేక్షకుల నుండే కాకుండా సినీ ప్రముఖుల నుండి అనూహ్య స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేశారు. "ఓ ప్రియా.. నా ప్రియా" అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నేహాశెట్టి కథానాయికగా నటిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని మే 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Untitled Document
Advertisements