విద్యకై ఉద్యమించిన ఎన్టీఆర్!!

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 06:51 PM

విద్యకై ఉద్యమించిన ఎన్టీఆర్!!

హైదరాబాద్, ఏప్రిల్ 16 : య౦గ్ టైగర్ ఎన్టీఆర్.. మే 20న పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని తన అభిమానులు సరికొత్త గిఫ్ట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన అన్ని సినిమాల్లోని పాత్రలను తెలుపుతూ 35 పేజీల పుస్తకాన్ని తయారు చేశారు. అందులో నుండి రోజుకో పేజీ విడుదల చేస్తున్నారు.

అప్పట్లో కమర్షియల్ మూవీగా వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "సాంబ". తాజాగా రిలీజ్ చేసిన ఈ పేజీలో "విద్యకై ఉద్యమించిన సాంబశివుడు ఎన్టీఆర్" అంటూ 'సాంబ' సినిమాకు సంబంధించిన ఫోటో విడుదల చేశారు. ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్‌బుక్‌లో ఇది 6వ పేజీ అని తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Untitled Document
Advertisements