కమిన్స్‌ స్థానంలో మిల్నే

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 07:05 PM

కమిన్స్‌ స్థానంలో మిల్నే

ముంబై, ఏప్రిల్ 16 : ఐపీఎల్‌-11 సీజన్ ప్రారంభమైన నుండి గాయాల కారణంగా ఆయా జట్ల ఆటగాళ్లు దూరమవుతున్నారు. తాజాగా గాయంతో లీగ్ నుండి వైదొలిగిన ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ స్థానంలో న్యూజిలాండ్‌ బౌలర్‌ ఆడమ్‌ మిల్నేను భర్తీ చేయనుంది. దీనిని ఐపీఎల్‌ అధికారులు ధృవీకరించారు. అయితే ఈ ఆటగాడి చేరికపై ముంబై ఇండియన్స్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

గత సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు ఆడిన ఈ కివీస్‌ బౌలర్‌పై ఈ సీజన్‌ వేలంలో ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. ఇప్పటికే మిల్నే ముంబై జట్టుతో చేరి ప్రాక్టీస్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఏప్రిల్‌ 17( మంగళవారం)న ముంబై, బెంగళూరుల మధ్య జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది.

Untitled Document
Advertisements