దూసుకెళ్తున్న "మహానటి"..

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 07:23 PM

దూసుకెళ్తున్న

హైదరాబాద్, ఏప్రిల్ 16 : అలనాటి మేటి నటి సావిత్రి జీవితకథ ఆధారంగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో "మహానటి" చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సమ౦త, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, శాలినీ పాండే ముఖ్య పాత్రధారలుగా నటిస్తున్నారు. ఇటీవల 'మహానటి' టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

టీజర్ రిలీజ్ అయి కనీసం 24 గంటలు గడువకముందే '1' మిలియన్ వ్యూస్ సాధించిన విషయం తెలిసిందే. "అనగనగా ఒక మహానటి.." అంటూ సావిత్రి గొప్పతనాన్ని తెలియజేసేలా కొన్ని సన్నివేశాలతో రూపొందిన ఈ టీజర్‌.. ఇప్పటివరకు '3'మిలియన్స్ వరకు రాబట్టింది. ఈ సందర్బంగా 3 మిలియన్ వ్యూస్ అంటూ చిత్రయూనిట్ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది.





Untitled Document
Advertisements