కాంగ్రెస్ లో సీట్ల రగడ

     Written by : smtv Desk | Tue, Apr 17, 2018, 11:51 AM

కాంగ్రెస్ లో సీట్ల రగడ

కర్ణాటక, ఏప్రిల్ 17 : వచ్చే నెల 12న కన్నడ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పెద్దలుఆదివారం రాత్రి విడుదల చేసిన 218 మంది అభ్యర్థుల జాబితా రగడ రాజేసింది. మొత్తం 224 స్థానాల కోసమే జరిగే ఈ మెగా సమరంకు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఆగ్రహంతో నాయకులు ఆందోళనలకు దిగడంతో పలు చోట్ల ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ధర్నాలు, నిరసనలతో పాటు పార్టీ కార్యాలయాల్లో విధ్వంసానికీ పాల్పడ్డారు. దశాబ్దాల కాలంగా పార్టీకి సేవలు చేస్తే మాకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారసులు, బంధువులు, ఫిరాయింపుదారులకు టికెట్లు ఇస్తారంటూ మండిపడ్డారు.

Untitled Document
Advertisements