పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి

     Written by : smtv Desk | Tue, Apr 17, 2018, 12:49 PM

పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 17 : గత కొన్నిరోజులుగా కాస్టింగ్ కౌచ్ పై తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న వివాదం అందరికీ తెలిసిందే. ఈ ఉదంతంపై స్పందిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మీరు లీగల్ గా ప్రొసీడ్ అయ్యి పోలీసు కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ మీకు న్యాయం జరగకపోతే మీ వెనుక మేమందరం వస్తాం అని చెప్పారు. అయితే ఆ కాస్టింగ్ కౌచ్ చర్చలను లేవదీసిన మహిళా నటి శ్రీ రెడ్డి ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అసభ్యమైన పదజాలంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇది విన్నపవన్ అభిమానుల్లో ఆగ్రహజ్వాలలు రేగాయి. కొందరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.


'ఒక్కోసారి నన్ను తిడుతుంటే అది మీ అందరికీ ఇబ్బంది కలిగించవచ్చు. నేను భరిస్తాను. బలవంతుడే భరిస్తాడు. మనం బలమైన వ్యక్తులం. భరిద్దాం. భరించినవాడే సాధించగలడు' అనేది ఆ వీడియో సారాంశం. ఈ వీడియో నిన్న జరిగిన సంఘటనపై పవన్ స్పందన అని ఫ్యాన్స్ మరియు కార్యకర్తలు పొరబడుతున్నారు. ఈ వీడియో ఇంతకుముందు కత్తి మహేష్ విషయంలో మాట్లాడిన పాత వీడియో. ఏదేమైనా కాస్టింగ్ కౌచ్ వివాదం కాస్త ముదిరి పవన్ ను రాజకీయంగా టార్గెట్ చేసే దిశకు మారింది.


Untitled Document
Advertisements