కామన్వెల్త్‌ విజేతలకు ఘనస్వాగతం

     Written by : smtv Desk | Tue, Apr 17, 2018, 01:05 PM

కామన్వెల్త్‌ విజేతలకు ఘనస్వాగతం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17 : గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ జెండాను రెపరెపలాడించి.. పతకాలు సాధించి వచ్చిన భారత క్రీడాకారులకు దేశంలో ఘన స్వాగతం లభించింది. రెజ్లింగ్‌ విభాగంలో స్వర్ణం సాధించిన సుశీల్‌ కుమార్‌కి, బాక్సింగ్‌ విభాగంలో స్వర్ణం సాధించిన మేరికోమ్‌కి సొంత రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో దేశానికి తొలిసారిగా స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారిణి మనికా బత్రాకు ఢిల్లీలో ఘనస్వాగతం దక్కింది. మంగళవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మనికాకు అభిమానులు పెద్దఎత్తున స్వాగత ర్యాలీ నిర్వహించారు. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యలను భారత అథ్లెట్లు సొంతం చేసుకున్నారు. మొత్తం 66 పతకాలతో భారత్‌ మూడోస్థానంలో నిలిచింది.

Untitled Document
Advertisements