ధావన్ చిలిపి చేష్టలు చూశారా..!

     Written by : smtv Desk | Tue, Apr 17, 2018, 01:44 PM

ధావన్ చిలిపి చేష్టలు చూశారా..!

మొహాలీ, ఏప్రిల్ 17 : టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ ఎక్కడ ఉన్న అక్కడ సందడి చేస్తాడు. తను చేసే చిలిపి చేష్టలను ధావన్‌ ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటాడు. ప్రస్తుతం ధావన్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా ధావన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తన తదుపరి మ్యాచ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో ఆడేందుకు ఇప్పటికే మొహాలీ చేరుకుంది.

ఇరు జట్ల మధ్య గురువారం మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మొహాలీ బయల్దేరింది. చాలా మంది ఆటగాళ్లు నిద్రలోకి జారుకున్నారు. ధావన్‌కేమో నిద్ర రావడం లేదు. టైం పాస్‌ కావడం లేదు. దీంతో హాయిగా నిద్రపోతున్న ఆటగాళ్లను ఎలా అయిన లేపాలనుకున్నాడు. ఇందుకు ఏం చేశాడో తెలుసా...!

ఒక కాగితం తీసుకుని దాన్ని షకీబ్‌ ఆల్‌ హాసన్‌, రషీద్‌ ఖాన్‌ ముక్కులో పెట్టి వారిని నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. తమ నిద్రకు భంగం కల్గించిన ధావన్‌ను వీరిద్దరూ ఏం అనలేదు. ధావన్‌ చిలిపి చేష్టలను చూసి విమానంలో ఉన్న వారంతా నవ్వుతూనే ఉన్నారు.


Untitled Document
Advertisements