'వీవీపీఏటీ' మార్పుల కోసం వినతి

     Written by : smtv Desk | Tue, Apr 17, 2018, 02:16 PM

 'వీవీపీఏటీ' మార్పుల కోసం వినతి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17 : ఓటు నమోదు రశీదు (వీవీపీఏటీ) యంత్రాల్లో మార్పుల కోసం వచ్చిన విజ్ఞప్తిని పరిశీలించాలని సుప్రీం కోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. ఒకవేళ తాను ఉద్దేశించిన అభ్యర్థికి కాకుండా మరొకరికి ఓటు పడితే.. ఆ ఓటును సదరు ఓటరు రద్దు చేసుకునేలా యంత్రంలో ఏర్పాటు ఉండాలన్న వాదన నేపథ్యంలో న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది.

ఓటు ఎవరికీ వేశామో తెలుసుకునేందుకు వీవీపీఏటీ వ్యవస్థను 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రయోగ ప్రాతిపదికన 8 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ప్రవేశపెట్టారు. ఈ యంత్రాల్లో లోపాలకు ఆస్కారం ఉందంటూ అరుణ్ కుమార్ అనే ఇంజినీర్‌ వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

Untitled Document
Advertisements