దినేష్ కార్తీక్ @ 3000

     Written by : smtv Desk | Tue, Apr 17, 2018, 03:34 PM

దినేష్ కార్తీక్ @ 3000

కోల్‌కతా, ఏప్రిల్ 17 : కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు సారథి, దినేష్ కార్తీక్ ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఈ టోర్నీలో మూడు వేలకు పైగా పరుగులు చేసి సురేశ్‌ రైనా, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, ధోనీ, డేవిడ్‌ వార్నర్‌, రాబిన్‌ ఉతప్ప, క్రిస్‌ గేల్‌ తదితర ఆటగాళ్ల సరసన నిలిచాడు. లీగ్ లో భాగంగా నిన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ - దిల్లీ డేర్‌డెవిల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో దినేశ్‌ కార్తీక్‌ ఈ ఫీట్ అందుకున్నాడు. తన కెరీర్‌లో 156వ ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న కార్తీక్‌ 138 ఇన్నింగ్స్‌ల్లో 3వేల పరుగుల మైలురాయిని దాటాడు.

దీంతో ఐపీఎల్‌ చరిత్రలో మూడు వేల పరుగుల మార్కును చేరిన 12వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కోల్‌కతా రెండు విజయాలు సాధించింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో సురేశ్‌ రైనా(4,558) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, విరాట్‌ కోహ్లి(4,527), రోహిత్‌ శర్మ(4,251) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

Untitled Document
Advertisements