చిట్టిబాబుగా ఎన్టీఆర్ నటిస్తే..! సుకుమార్ స్పందన..

     Written by : smtv Desk | Wed, Apr 18, 2018, 11:50 AM

చిట్టిబాబుగా ఎన్టీఆర్ నటిస్తే..! సుకుమార్ స్పందన..

హైదరాబాద్, ఏప్రిల్ 18: 'ఎంతసక్కగున్నావే లచ్చిమి ఎంతసక్కగున్నావే' అంటూ తెరపైకి వచ్చి సంచలనం సృష్టించిన 'చిట్టిబాబు'.. ఆయన దర్శకుడు సుకుమార్ ఇప్పుడు మంచి హుషారుగా ఉన్నారు. 'రంగస్థలం' విడుదలైన దగ్గరనుంచి ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇటీవల విజయోత్సవ వేడుకలు జరుపుకోవడం.. ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాజాగా ఈ సినిమాపై దర్శకుడు సుకుమార్ కు కొన్ని కొత్త ప్రశ్నలు వీక్షకుల నుంచి ఎదురవుతున్నాయి.

'చిట్టిబాబు' పాత్రని చరణ్ తప్ప ఇంకొకరు చేయలేరు' అని ఓ వేదికపై సుకుమార్ చెప్పిన మాటని గుర్తుచేస్తూ.. ఇదే పాత్రని ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉంటుందని ఓ యాంకర్ అడిగారు. ఈ ప్రశ్నకు సుకుమార్ స్పందిస్తూ.. 'ఈ కథకి చరణ్ ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేను. అంతలా నా ఆలోచనలని ఆక్రమించేశాడు చరణ్. ఇక ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉంటుందని మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా.., 'ఒకే పోటి ఇద్దరు వ్యక్తులకి పెట్టి ఎవరు గెలిచారో చెప్పొచ్చు. ఇదే సినిమాని ఒకవైపు చరణ్ తో, మరోవైపు ఎన్టీఆర్ తో చేసి ఎవరు బాగా చేశారో కూడా చెప్పొచ్చు. కానీ ఒక హీరో చేసిన దానికి, మరొక హీరో ఎలా చేస్తాడని పోల్చడం మాత్రం సరికాదు' అని వెల్లడించారు.





Untitled Document
Advertisements