'అది ఫ్రీ కదా'.. మళ్ళీ కన్ను గీటిన ప్రియ ప్రకాష్ వారియర్

     Written by : smtv Desk | Wed, Apr 18, 2018, 12:24 PM

'అది ఫ్రీ కదా'.. మళ్ళీ కన్ను గీటిన ప్రియ ప్రకాష్ వారియర్

ముంబై, ఏప్రిల్ 18 : 'అమ్మాయిల ఓర చూపుకే అబ్బాయిల ప్రాణాలు విలవిలలాడి పోతాయి.. అలాంటిది కన్ను కొడితే ఇంకేమైనా ఉంటుందా..!! అని అబ్బాయిలు సరదాగా మాట్లాడుకోవడం పరిపాటి. కన్ను కొట్టి ప్రపంచంలోని కుర్రకారుని తన వైపు తిప్పుకున్న 'ఒరు అదార్‌ లవ్' నటి ప్రియా ప్రకాష్ వారియర్, మరోసారి కన్ను గీటింది. అయితే ఈసారి సినిమా కోసం కాదులెండి.. ఓ చాక్లెట్ యాడ్ కోసం.

ఈ ప్రకటనలో ప్రియా ప్రకాష్ వారియర్ క్రికెట్ గ్రౌండ్ లో కూర్చొని చాక్లెట్ తింటూ ఉంటుంది. ఆ పక్కనే కొంతమంది ఆటగాళ్ళు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తు ఉంటారు. ఇంతలో ఆమె దగ్గరకి ఆటగాళ్లు విసిరిన బంతి వస్తుంది. ఆ బంతిని ఇవ్వమని అడిగితే .. విసిరేసిన వస్తువును తాను ముట్టుకోనని ప్రియ సమాధానం చెబుతుంది. దీంతో నువ్వు చాలా టెక్కు చూపిస్తున్నావ్.? అని ఆటగాడు అనగా.. 'అది ఫ్రీ కదా' అంటూ నవ్వుతూ కన్నుగీటి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం ఈ యాడ్ ఇంటర్నెట్ లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ప్రియ నటించిన "ఒరు అదర్ లవ్" చిత్రం జూన్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.






Untitled Document
Advertisements