పాండ్యది ఔట్ కాదా..!

     Written by : smtv Desk | Wed, Apr 18, 2018, 01:58 PM

పాండ్యది ఔట్ కాదా..!

ముంబై, ఏప్రిల్ 18 : ఐపీఎల్ లో భాగంగా నిన్న ముంబై ఇండియన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ (ఆర్సీబీ) మధ్య జరిగిన మ్యాచ్ పాండ్య ఔట్ పై కోహ్లి ఆగ్రహానికి లోనయ్యాడు. అందుకు కారణం పాండ్య ఔటైన అది ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించడమే. అసలేం జరిగిందంటే... ఆర్సీబీ బౌలర్‌ క్రిస్‌ వోక్స్‌ వేసిన 19వ ఓవర్‌ తొలి బంతికి కీరన్‌ పొలార్డ్‌ ఔటవడంతో హార్దిక్‌ పాండ్య క్రీజులోకి వచ్చాడు. వోక్స్‌ వేసిన రెండో బంతికి హార్దిక్‌ క్యాచ్‌ ఔట్‌ అంటూ ఆర్సీబీ అప్పీల్‌ చేయడం.. ఫీల్డ్‌ అంపైర్‌ వేలెత్తడం చకచక జరిగిపోయాయి.

కానీ పాండ్య అనుమానంతో సమీక్ష కోరాడు..? రీప్లేలో బంతి తాకీ తాకనట్లుగా బ్యాట్‌కు తాకినట్లు అల్ట్రా ఎడ్జ్‌ చూపించింది. కానీ మూడో అంపైర్‌ ఆదేశం మేరకు ఫీల్డ్‌ అంపైర్‌ పాండ్యను నాటౌట్‌గా ప్రకటించాడు. అల్ట్రా ఎడ్జ్‌ అలా చూపించినా నాటౌట్‌ ఇవ్వడమేంటని కోహ్లి, వోక్స్‌ ఆశ్చర్యపోయాడు. విరాట్ ఈ నిర్ణయం సరైంది కాదని అడ్డంగా తల ఊపుతూ.. అసహనం వ్యక్తం చేశాడు. అయితే బంతి గమనం లెక్కలోకి తీసుకొని అది బ్యాట్‌కు తాకినట్లు కచ్చితమైన నిర్ణయానికి రాకపోవడం వల్లే నాటౌట్‌గా ప్రకటించినట్లు సమాచారం.







Untitled Document
Advertisements