దేశంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి : ఏచూరి

     Written by : smtv Desk | Wed, Apr 18, 2018, 02:45 PM

దేశంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి : ఏచూరి

హైదరాబాద్, ఏప్రిల్ 18 : దేశంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయని సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ మహాసభల ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. దేశంలో దళితులు, ముస్లింలపై దాడులు పెరిగిపోతున్నాయని, ఇలాంటి మతోన్మాదం వల్ల దేశ ఐక్యతకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు.

దాడులను అడ్డుకునే శక్తి వామపక్షాలకు మాత్రమే ఉందని.. ఇలాంటి మతోన్మాద దాడులను అడ్డుకునేందుకు కలిసి పనిచేయాలని అన్నారు. అంతేకాకుండా వ్యవసాయం సంక్షోభంలో పడిందని, యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ఓడించేందుకు ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలన్నారు.





Untitled Document
Advertisements