మీ శత్రువులే నాతో ఇలా చేయించారు.. : శ్రీ రెడ్డి

     Written by : smtv Desk | Wed, Apr 18, 2018, 04:51 PM

మీ శత్రువులే నాతో ఇలా చేయించారు.. : శ్రీ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 18 : టాలీవుడ్ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ వివాదం కాస్త ముదిరి.. రాజకీయ వివాదంగా మారినట్లుంది. రోజుకో విధంగా మారుతున్న ఈ ఉదంతంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అసభ్య పదజాలంతో దూషించిన శ్రీరెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీరెడ్డి మాటలను నిరసిస్తూ ఇప్పటికే సినీ నటుడు నాగబాబు మీడియా సమావేశం నిర్వహించగా.. మరికొందరు ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో ఈ అంశంపై చర్చించుకొ౦టున్నారు.

ఈ నేపధ్యంలో 'మీ శత్రువులే నాతో ఇలా చేయించారు' అంటూ మరొక కోణాన్ని బయటపెట్టింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. 'పవన్ కళ్యాణ్ కి వాళ్ళ అమ్మకి బహిరంగ క్షమాపణలు. మంచి సలహా ముసుగులో మీ శత్రువులు ఇలా మాట్లాడమని నన్ను బలవంత పెట్టారు. నేను వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మి మోసపోయాను. నేను ఏ రాజకీయ పార్టీకి చెందను. అదేవిధంగా బిర్యానీల కోసం పని చేయను. నా తప్పు ఉంది కనుక సామాజిక మాధ్యమాల్లో నన్ను ట్రోల్ చేసినా భరిస్తాను. క్షమించండి.' అని ఫేస్ బుక్ వేదికగా ఆవిడ పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ కి ఉన్న శత్రువులు ఎవరు? ఆ శత్రువులు రాజకీయంగా ఉన్నారా? లేక వ్యక్తిగతంగా ఉన్నారా? వీళ్ళ పేర్లు కూడా శ్రీ రెడ్డి బయట పెడుతుందా.?ఒకవేళ బయట పెడితే జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి.? ఈ వివాదం ఏ వైపు మళ్లుతుంది.? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.





Untitled Document
Advertisements