ఆర్‌టీఐ పరిథిలోకి బీసీసీఐ..!

     Written by : smtv Desk | Wed, Apr 18, 2018, 06:22 PM

ఆర్‌టీఐ పరిథిలోకి బీసీసీఐ..!

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 : ప్రపంచ క్రికెట్ లో పెద్దన్నగా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ను సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిథిలోకి తీసుకురావాలని న్యాయకమిషన్‌ బుధవారం ప్రభుత్వాన్ని కోరింది. బీసీసీఐ ప్రభుత్వం తరహాలో వ్యవహరిస్తుండటంతో ఇతరులకు రాజ్యాంగం నిర్ధేశించిన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోందని కమిషన్‌ వెల్లడించింది.

తమది ప్రైవేట్‌ సంస్థ అన్న బీసీసీఐ వాదనను లా కమిషన్‌ నిరాకరించింది. బీసీసీఐతో పాటు దాని అనుబంధ క్రికెట్‌ అసోసియేషన్లను ఆర్‌టీఐ చట్ట పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్‌ బోర్డుగా పేరొందిన బీసీసీఐ తమిళనాడు సొసైటీల రిజిస్ర్టేషన్‌ చట్టం కింద నమోదై ప్రైవేట్‌ సంస్థగా కార్యకలాపాలు జరుపుతుంది.





Untitled Document
Advertisements