కేఎల్‌ బర్త్‌డే కేక్ లో గేల్‌

     Written by : smtv Desk | Wed, Apr 18, 2018, 06:58 PM

కేఎల్‌ బర్త్‌డే కేక్ లో గేల్‌

మొహాలీ, ఏప్రిల్ 18 : టీమిండియా క్రికెటర్ కేఎల్‌ రాహుల్‌ ఈ రోజు (ఏప్రిల్‌ 18)26వ జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నాడు. ప్రస్తుతం కేఎల్ ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరుపున ఆడుతున్నాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు, అభిమానులు రాహుల్‌కు సామాజిక మాధ్యమాల వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు


కింగ్స్‌ ఎలెవన్‌ జట్టు సభ్యులు, ఫ్రాంఛైజీ నిర్వాహకులు శుభాకాంక్షలు తెలిపారు. సహచర ఆటగాళ్ల మధ్య రాహుల్‌ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నాడు. యువరాజ్‌, గేల్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే బర్త్‌డే బాయ్‌ రాహుల్ కట్‌ చేసేందుకు ఏర్పాటు చేసిన కేక్‌ విన్నూత రీతిలో ఉంది. ఇంతకీ ఆ కేకులో అంత ప్రత్యేకత ఏమిటి అనుకుంటున్నారా...! గేల్‌ ముఖం చుట్టూ పండ్ల ముక్కలు ఉంచి ఇదే బర్త్‌డే కేక్‌ అని సహచరులు రాహుల్‌ను ఆట పట్టించారు. ఆ సరదా వీడియోపై మీరు ఓ లుక్కుయేండి..








Untitled Document
Advertisements