నా కడుపు రగులుతోంది.. : నటుడు కృష్ణుడు

     Written by : smtv Desk | Wed, Apr 18, 2018, 07:14 PM

నా కడుపు రగులుతోంది.. : నటుడు కృష్ణుడు

హైదరాబాద్, ఏప్రిల్ 18 : సినీనటుడు విలేజ్ లో వినాయకుడు ఫేం.. కృష్ణుడు ఫేస్‌బుక్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తన ఫేస్‌బుక్‌లో తన ఆవేదనను వెళ్ళగక్కాడు. నా కడుపు రగులుతోందంటూ మండిపడ్డారు. పవన్ ను శ్రీరెడ్డి అన్న మాటలకు అసలేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకి కృష్ణుడు ఏమన్నాడో.? తన మాటల్లోనే..!!

ఒక సినిమా,
ఒక ఆడియో రీలీస్,
ఒక ఇంటర్వ్యూ,
ఒక షార్ట్ ఫిల్మ్,
ఒక న్యూస్ ఛానెల్.
ప్రతీ ఒక్కడు.... ప్రతి ఒక్కడూ... పవన్ పేరుని వాడుకున్న ప్రతి ఒక్కడూ స్పందించాలి. మీ అభిమానముతోనో, మీ సినిమాకి హైప్ కోసమో, మీ ఇంటర్వ్యూ సక్సెస్ కోసమో ఆయన పేరు వాడుకున్న ప్రతి ఒక్కరు స్పందించాలి.

ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ స్పందించాలి,
ఇవాల పవన్ కళ్యాణ్ ని అన్నది, రేపు మిమ్మల్ని అంటుంది.మీరు స్పందించండి, అక్కడ పవన్ కళ్యాణ్ ని అనలేదు, పవన్ తల్లిని అసభ్యంగా అన్నారు.
గొప్ప గొప్ప రచయితలు,
గొప్ప గొప్ప దర్శకులు,
గొప్ప గొప్ప లిరిసిస్ట్ లు
పెద్ద ప్రొడ్యూసర్లు,
పెద్ద దర్శకులు ఇవాళ పవన్ రేపు మీరు! మీ అమ్మల్ని , అక్కల్ని అనడానికి కూడా అది ఏమాత్రం ఆలోచించదు.మా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ, కళామతల్లి ముద్దు బిడ్డలం అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ గళం విప్పండి. సహనంతో ఉండే సమయం మించిపోయింది. ఓపికగా ఉండే హద్దులు పగిలిపోయాయ్. ఇక అడుగేయండి, ఒకే ఒక్క అడుగు.

అభిమానులు స్పందించండి...
ఇవాళ మా హీరో
రేపు మహేష్ ఫాన్స్,
ఎల్లుండి ప్రభాస్ ఫాన్స్,
ఆ తర్వాత తారక్ ఫాన్స్
వదిలేస్తే మీదాక కూడా వస్తుంది. మీ హీరో మా హీరో కాదు, మన సిన్మావాళ్ళు. మాన ఇండస్ట్రీ గుర్తుంచుకోండి.

ఇప్పటికీ ఈ అగ్ర హీరోలపై శ్రీ రెడ్డి పోరాటం అంటుంది కానీ
' పవన్ కళ్యాణ్ మాదర్ చోద్ అన్న శ్రీరెడ్డి' అన్న న్యూస్ కాదు కనీసం స్క్రోలింగ్ కూడా లేదు.

స్త్రీల గౌరవం కోసం పోరాడే మహిళా సంఘాలు ఎక్కడికి పోయాయి?? పవన్ కళ్యాణ్ అమ్మ కూడా ఒక స్త్రీనే! ఒక స్త్రీ గౌరవంకోసం స్పందించకపోతే మీరు చేసే పోరాటానికి అర్థమేముంది?

ప్రేక్షకులు, ప్రజలు కూడా స్పందించండి సినిమా వాళ్ళు ఏ ఆదివారమో, నెలకోసారో నువ్వూ నీ ఫ్యామిలీ సరదాగా హాల్ కెళ్తే మిమ్మల్ని నవ్వించే, ఆనందంగా ఇంటికిపంపించే సినిమా వాడు కదా మీరు కూడా స్పందించండి.

ఇప్పుడు నాకు భాస్కరభట్ల గారి మాటలు గుర్తొస్తున్నాయి...
'సరదాగా మీరంతా మా సినిమాలే చూస్తారండి
అయినా మేమంటే ఓ చిన్న చూపులేండి!'





Untitled Document
Advertisements