వేసవిలో హెయర్ ను కాపాడుకోవడం ఎలా?

     Written by : smtv Desk | Thu, Apr 19, 2018, 12:29 PM

వేసవిలో హెయర్ ను కాపాడుకోవడం ఎలా?

హైదరాబాద్, ఏప్రిల్ 19: వేసవికాలంలో జుట్టును చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. సూర్యకిరణాలు వెంట్రుకలకు హాని చేస్తాయి. మాడుపై ఏర్పడే చెమట, నూనె కలిసి జట్టును నీర్జీవంగా మారుస్తాయి. దీంతో జుట్టు రఫ్ గా, జిడ్డుగా మారిపోతుంది. ప్రతిరోజు తలస్నానం చేస్తుంటే ఏ సమస్య తలెత్తదు.

తలస్నానం చేస్తే వెంట్రుకలు పాడాయిపోతాయని కొందరు అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. జుట్టు కూడా శరీరంలో మిగతా భాగాల వంటిదే. కాబట్టి క్రమం తప్పకుండా క్లీన్ చేసుకోవడం అవసరం. మైల్డ్ షాంపూతో రోజు తలస్నానం చేయాలి. ఎండలో ఉండాల్సి వచ్చినప్పుడు తలకు టోపీ ధరించాలి.

నూనె పెడితే తల చల్లగా ఉంటుందనేది నిజం కాదు. వేసవికాలంలో తలకు ఎక్కువ నూనె రాయడం వలన లాభం కంటే నష్టం ఎక్కువ. జుట్టు పొడవెంత వున్నాచిట్లిపోయిన జుట్టును ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. పెర్మింగ్, కలరింగ్. ఇతర చికిత్సలకు వేసవి మంచి సీజన్.

తేమ తక్కువగా ఉంటుంది కనుక, జుట్టుకు ఏ రకమైన చికిత్సలు చేసినా బాగా పనిచేస్తాయి. పగలంతాజుట్టు ముఖం మీద పడకుండా బిగించి కట్టుకున్నా, రాత్రివేళల్లో లూజ్ గా, ఫ్రీగా వదిలేయాలి.





Untitled Document
Advertisements