బన్నిని అనూ.. ఏమని కోరి౦దో తెలుసా..!!

     Written by : smtv Desk | Thu, Apr 19, 2018, 12:42 PM

బన్నిని అనూ.. ఏమని కోరి౦దో తెలుసా..!!

హైదరాబాద్, ఏప్రిల్ 19 : అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్రం "నా పేరు సూర్య". ఈ చిత్రంలో బన్ని సరసన కథానాయికగా.. అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ఈ చిత్రానికి వక్కతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. రామలక్ష్మి సినీ క్రియేషన్ పతాకంపై లగడపాటి శ్రీధర్, నాగేంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తయింది. ఈ మేరకు ఈ నెల 22 న ఆడియోను విడుదల చేసి 29వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారు. అయితే అనూ ఇమ్మాన్యుయేల్ బన్నిని ఓ కోరిక కోరిందట. తనతో ఒక సెల్ఫీ దిగాలని అడగడంతో షూటింగ్ చివరి రోజు బన్ని సెల్ఫీ తీసి ఇచ్చాడట. కాగా ఈ చిత్రాన్ని మే 4 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.





Untitled Document
Advertisements